Home Page SliderNational

దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా టైటిల్  ఏంటంటే..?

దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు. దీంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ సందర్భంగా దుల్కర్ కొత్త సినిమా అప్‌డేట్ కూడా వచ్చేసింది. కాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాకి “లక్కీ భాస్కర్” అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే  ఈ రోజు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ,సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.