“కల్కి” సినిమాలో ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా “కల్కి” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు.కాగా దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్ ఒకరిగా ఉన్నారు. అయితే ఆయన కల్కికి రెమ్యూనరేషన్ సగానికి తగ్గించినట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్ ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.150కోట్లు తీసుకుంటువచ్చినట్లు సమాచారం. కల్కి సినిమాకి ప్రభాస్ రూ.80కోట్లు మాత్రమే తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే కల్కి సినిమా బడ్జెట్ రూ.600కోట్లు భారీగా ఉండడంతోనే ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించిన అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపిక పదుకునె తలా రూ.20కోట్లు తీసుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.