Andhra PradeshHome Page Slider

ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ సమాధానం ఏంటంటే..?

ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం సమాధానం చెప్పాలని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ 1 నాటికి ఏపీలో రూ.26,292కోట్ల విలువైన 17 కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతుందన్నారు. అయితే ఏపీలో ఇప్పటికే  రూ.5,530 కోట్ల రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తైంది అన్నారు.2014-2024 మధ్య కాలంలో ఏపీలో ఏడాదికి 151 కిలో మీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టామన్నారు. 2014-2024 మధ్య కాలంలో ఏపీకి ఏడాదికి సగటున రూ.8,406 కోట్ల రైల్వే నిధులు కేటాయించడం జరిగిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.