Home Page SliderNational

అనంత్ అంబానీ పెళ్లిలో అందరూ మెచ్చిన ఆ విషయం ఏంటంటే?

ముకేశ్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి వేల కోట్లు ఖర్చు చెయ్యడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పెళ్లికి ఇంత ఖర్చు చేసి హడావిడి చేయాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వేడుక వల్ల ఎంతోమంది నిరాశ్రయులు,పేదలు,క్యాబ్ డ్రైవర్లు ఇలా చాలామంది “యాంటిలియా” ముందు రుచికరమైన ఆహారాన్ని తింటున్నట్లు తెలుస్తోంది. కాగా అంబానీ ఇంట్లో అనంత్-రాధికల పెళ్లి వేడుక మొదలైనప్పటి నుంచి ముకేశ్-నీతా అంబానీ ఇలా అన్నదానం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఎంతోమంది పేదల కడుపులు నింపే అన్నదాన కార్యక్రమం చేపట్టడంపై ముకేశ్-నీతా అంబానీని విమర్శించిన వారే ప్రశంసలు కురిపిస్తున్నారు.