ICC మహిళల ఛాంపియన్‌షిప్ భారత్ స్థానం ఎంతంటే?
ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. అయితే 27 పాయింట్లతో 19 మ్యాచ్‌లు ఆడి 13 విజయాలు నమోదు చేసిన భారత్ స్థానం మూడవ స్థానం సాధించింది. భారత్ ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మహిళా క్రికెట్‌ను మరింత విస్తరించి అభివృద్ధి చేసేందుకు ఐసీసీ ప్రతి మూడేళ్ల సీజన్ కోసం వన్డే ఛాంపియన్ షిప్‌ను నిర్వహిస్తోంది. ఈ ఛాంపియన్ షిప్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు వన్డే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. ఒకవేళ టాప్ 6లో లేకపోతే క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడి వరల్డ్ కప్ ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఆస్ట్రేలియా 24 మ్యాచుల్లో 18 విజయాలతో మొదటి స్థానం సాధించింది. ఇంగ్లండ్ 24 మ్యాచుల్లో 15 విజయాలు సాధించి రెండవస్థానంలో ఉంది.