ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో ఏమిచ్చారు?
ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన అంశాలకు 2024-25 బడ్జెట్‌లో భారీగానే నిధులను కేటాయించారు ఆర్థిక మంత్రి. ఈ బడ్జెట్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రూ.90,658.63 కోట్లు నిధులను కేటాయించారు. వీటిలో ప్రధానమైన ప్రతిపాదనలలో మూడు కాన్సర్ ఔషధాలను ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ నుండి పూర్తిగా మినహాయించాలని నిర్ణయించారు. ఈ మధ్య కాలంలో కాన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య అధికంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాన్సర్ చికిత్స సామాన్యులకు ఆర్థిక భారం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి నిర్మలా సీతారామన్. ఎక్స్‌రే ట్యూబులు, డిజిటల్ డిటెక్టర్‌ల భాగాలపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. మధ్యంతర బడ్జెట్ 2024 సందర్భంగా, ఆమె ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల విభాగాలపై వివిధ కార్యక్రమాలు ప్రకటించారు.