గుమ్మడి గింజలు తింటే ఏం జరుగుతుంది?
గుమ్మడి గింజలను తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చాలామందికి తెలుసు. కానీ ఈ గుమ్మడి గింజలలో ఎన్ని పోషకాలున్నాయో, తింటే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో అందరికీ తెలియదు. గుమ్మడికాయను ఆహారంలో భాగంగా తీసుకునేవారు కూడా వాటి లోపల ఉండే గింజలను పారేస్తూ ఉంటారు. వీటివల్ల స్త్రీ, పురుషులిద్దరికీ మంచి ఆరోగ్యం సమకూరుతుంది.
చర్మసౌందర్యానికి, శిరోజాల ఆరోగ్యానికి ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి.
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఈ గింజలు చాలా ప్రభావం చూపిస్తాయి. వీటిలో మెగ్నీషియం అధిక స్థాయిలో ఉండడం వల్ల మధుమేహం ముప్పును తగ్గిస్తుంది.
ఈ గింజలు ఆహారంలో తీసుకుంటే గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్‌ల నుండి తప్పించుకోవచ్చు. నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలు పెంచి, రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది.
వీటిని అల్పాహారంలో కానీ, లంచ్, డిన్నర్‌లలో కానీ ఎలాగైనా తీసుకోవచ్చు.