తగినంత నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది?
నిద్ర లేమి అనేక సమస్యలకు దారితీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట మేలుకొని పనులు చేయడం, మొబైల్ లేదా టీవీ చూస్తూ గడపడం వంటి అలవాట్లు అనారోగ్యం కలిగిస్తాయి. వ్యక్తి జీవితకాలం నిద్రలేమి వలన తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. మానసిక సమస్యలు, తలనొప్పి, కళ్లు మంటలు వంటి అసౌకర్యాలు కలుగుతాయి. మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. మెదడుపై తీవ్ర ప్రభావం చూపి జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. నిద్ర తక్కువవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి త్వరగా బరువు పెరుగుతారు. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.

