ఈ మహానగరానికి ఏమైంది..
ఔటర్ రింగ్ రోడ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ 8 వరుసలతో 158 కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారి. హైదరాబాద్ రాక్స్, చెరువులు మరియు పార్కుల మహా నగరంగా ప్రఖ్యాతిగాంచినది. కానీ కొన్నేళ్లుగా చెరువులను ఆక్రమించడంతో హైదరాబాద్ కు తీవ్ర నష్టం వాటిల్లితోంది. ప్రస్తుతం నెమ్మదిగా రాళ్లు కనుమరుగవుతున్నాయి, పార్కులు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. జల వనరులు కూడా వేగంగా కనుమరుగవుతున్నాయి. చెరువుల ఆక్రమణల వల్ల భారీ వర్షాలతో వరదలు ఉప్పొంగుతున్నాయి. వృక్షాలు , పక్షులు అదృశ్యమవుతున్నాయి. పర్యావరణలో మార్పులు సంభవిస్తున్నాయి. ఉష్ణోగ్రత పెరుగుదల వంటి వాతావరణ మార్పుల వంటి తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది.
2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు 225 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురికాగా, 196 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయి. గత 10 సంవత్సరాలలో 24 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. మరికొన్ని పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయి. చెరువుల ఆక్రమణ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇది హైదరాబాద్‌కు మంచిదేనా? దాన్ని తనిఖీ చేయకుండా అనుమతించాలా? హైదరాబాదులో మిగులు జలాలు లేని పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ మన ముందు తరాల నుండి మనకు లభించిన వారసత్వం. మన తర్వాతి తరానికి మనం ఏమి వదిలేస్తున్నామని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.