రన్ మెషీన్ ఆటగాడికి ఏమైంది.. నిరాశలో ఫ్యాన్స్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్ జట్టుతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఢిల్లీ జట్టు తరఫున టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బరిలోకి దిగాడు. గత కొంతకాలంగా ఫాం లో లేక ఇబ్బందులు పడుతున్న రన్ మెషీన్ తిరిగి గాడిలో పడేందుకు రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఢిల్లీ తరఫున విరాట్ రంజీ బరిలోకి దిగాడు. అయితే, ఇక్కడ కూడా ఫ్యాన్స్ కు నిరాశ పరిచాడు. 15 బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. సాంగ్వాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అతని కోసం స్టేడియానికి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు నిరాశ చెందారు. నిన్నటి నుంచి అతని బ్యాటింగ్ చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. కోహ్లి ఇలా క్రీజులోకి వచ్చి అలా వెళ్లిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇక ఈ మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు 241 రన్స్ కు ఆలౌట్ అయింది.
Breaking news: కోహ్లి అభిమానులకు నిరాశ..

