బీజేపీ ఇచ్చిన హామీ ఏమైంది..?
ఆదిలాబాద్ సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై స్థానిక బీజేపీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టమైన వైఖరి చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. నేడు స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ అంశంపై కేవలం ఎంపీ, ఎమ్మెల్యే ప్రకటనలకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరీని ప్రారంభించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేసిన స్థానిక బిజెపి నాయకులకు సీసీఐ పునరుద్ధరణ విషయంలో ప్రస్తుతం ఎవరు అడ్డం వస్తున్నారో తేల్చి చెప్పలని అన్నారు జోగు రామన్న.