Home Page SliderInternational

అమెరికా అధ్యక్షుడి బైడెన్‌కి ఏమైంది..?

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కొన్ని రోజుల నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆయన ఇటీవల జరిగిన G7 సమావేశంలో కూడా విచిత్రంగా ప్రవర్తించారు. ఈ G7 సమావేశంలో భాగంగా ఆయా దేశాల ప్రధానులతో ఫోటో దిగకుండా ఆయన మరోవైపు తిరిగి ఎవరు లేని వైపు చేయి ఊపుతూ అయోమయంగా కనిపించారు. అయితే ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మరవక ముందే బైడెన్ మరో వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో బాగా ట్రెండ్ అవుతోంది. తాజాగా బైడెన్,అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో కలిసి డెమోక్రటిక్ నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా బైడెన్ అక్కడే నిలబడి బిగుసుకుపోయారు.దీంతో ఒబామా బైడెన్ చేయి పట్టుకొని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బైడెన్ ఆరోగ్యం సరిగ్గా లేదని కొందరు అమెరికన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆయన సతీమణి మాత్రం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఈ ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు.