వరద బాధితుల తోపులాట..ఏం జరిగిందంటే..
విజయవాడలో భారీ వర్షాల కారణంగా అనేకమంది ఇళ్లు ముంపునకు గురయ్యాయి. దీనితో ప్రభుత్వమే వారికి సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, ఆహార పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం పాల ప్యాకెట్ల లారీ అజిత్ సింగ్ నగర్‌లో పంపిణీ చేస్తుందగా, భారీ తోపులాట జరిగింది. ఒకరి మీద ఒకరు పడి, తీసుకున్న వారే మళ్లీ మళ్లీ ప్యాకెట్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనితో ప్యాకెట్లు పంపిణీ చేసే డెయిరీ సిబ్బంది చేతులు జోడించి నమస్కరించినా అక్కడున్నవారు పట్టించుకోలేదు. దీనితో ప్యాకెట్లు నేలపాలయి రోడ్డంతా పాలు పడింది. దీనితో పాటు ఆహారప్యాకెట్లు కూడా వృథా అయ్యాయి. ప్రజలు కొంచెం సంయమనం పాటించి, క్యూ పద్దతిలో పంపిణీకి సహకరిస్తే ఆహారం నేలపాలయ్యేది కాదని సంఘటన అనంతరం వారు మాట్లాడుకుంటున్నారు.

