InternationalNews

యూకే ప్రధాని రిషి సునక్… మాజీ ప్రధాని లిజ్ ట్రస్ ఏమన్నారంటే!

ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్ వీడ్కోలు ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పదవీ కాలం 45 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలను వివరించిన ట్రస్.. ప్రధానిగా రిషి సునక్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. తుఫానుతో పోరాడుతూనే ఉన్నామన్న ట్రస్… నేను ఎల్లప్పుడు బ్రిటన్‌ను నమ్ముతానన్నారు. బ్రిటిష్ ప్రజలను నమ్ముతానన్న ఆమె… త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు రాజీనామా లేఖను పంపించడానికి ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.