“పిఠాపురం MLA తాలుకా”పై డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ నిన్న ఉప్పాడలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో బాగా వైరల్ అయిన “పిఠాపురం MLA తాలుకా” నెంబర్ ప్లేట్‌పై స్పందించారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అని చెప్పి నాకు చెడ్డ పేరు తీసుకురాకండి అని పవన్ తెలిపారు. కాగా అధికారులు మిమ్మల్ని ఆపినప్పుడు మీరు ఎమ్మెల్యే తాలుకా అని చెబితే వాళ్లు నన్ను తిడతారని పవన్ పేర్కొన్నారు. అందరు చట్టాలు పాటించండి అని పవన్ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మీకు అంతగా కావాలంటే నా రెండకరాల పొలంలో మడ్ రేస్ పెడతానన్నారు. సరదాగా అందరు అక్కడికి వచ్చి రైడ్ చేయండి అని పవన్ పిలుపునిచ్చారు. అయితే మీరంతా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అని పవన్ స్పష్టం చేశారు.

