NationalNews

రాహుల్ గాంధీ ఏం కోరుకుంటున్నాడంటే..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వ్యవహారంలో క్లారిటీ వచ్చేస్తోంది. కర్నాటక మాజీ సీఎం మల్లికార్జున ఖర్గే ఓవైపు బరిలో దిగితే మరోవైపు మాజీ ఎంపీ, కేంద్ర మంత్రి శశిథరూర్ నిలుచున్నారు. ఇక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది పెద్దగా చెప్పాల్సిన పనిలేదన్నట్టుగా పరిణామాలు కన్పిస్తున్నాయ్. ఈ తరుణంలో శశిథరూర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అఫిషియల్ క్యాండిటేట్ అంటూ ఎవరూ ఉండబోరని సోనియా చెప్పారని… అందుకే తాను రేసులో నిలుచున్నానన్నారు. గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో భాగమని… పార్టీలో ఏ రోల్ పోషించాలన్నది రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మనసులో ఏముంది? ఆయన ఏం కోరుకుంటున్నాడన్నదానిపై ఏఐసీసీ ఎన్నికల ప్రధాన పోటీదారుగా ఉన్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ విషయంలో ఒక స్పష్టతతో ఉన్నారని… ఆయన ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్షుడు కావాలని కోరుకోవడం లేదని చెప్పారు శశి థరూర్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెలిస్తే పార్టీని వికేంద్రీకరిస్తానన్నారు శశి. హైకమాండ్ కల్చర్ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తానన్నారు. పార్టీకి వెన్నుముక ప్రజలు కాబట్టి… ప్రజలను ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తానన్నారు. పార్టీ కొత్త చిగురులు వేయాలని కోరుకుంటోందని.. ఆ ప్రకారమే ముందడుగేద్దామన్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుల కూటమి G-23 ఒక మిథ్య అని… అందులో తాను లేనన్నారు శశిథరూర్. గాంధీ కుటుంబ సభ్యులు మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా నిలుస్తోండటంతో.. థరూర్ గెలుపు కష్టమన్న భావన కలుగుతోంది. శశిథరూర్ లాంటి వ్యక్తి అధ్యక్ష పీఠంపై ఉంటే అనవసర సమస్యలు వస్తాయని గాంధీ విధేయులు తర్జనభర్జనపడుతున్నారు.