కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీకి కేజ్రీవాల్ మద్దతు!
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా ప్రకటించిన తర్వాత రాహుల్ గాంధీ మహాత్మా గాంధీ కోట్‌ను ఉదహరించారు. “నా మతం సత్యం మరియు అహింసపై ఆధారపడింది. సత్యమే నా దేవుడు, అహింస దానిని పొందే సాధనం” అని గాంధీ ట్విట్టర్‌లో రాశారు.
ఈ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కోర్టు బెయిల్ సైతం మంజూరు చేసింది. తీర్పుపై అప్పీల్ చేయడానికి 30 రోజుల పాటు సస్పెండ్ చేశారు.

భయంతో పనిచేస్తున్న యంత్రాంగాలు.. రాహుల్ గాంధీ గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా. అయితే తన సోదరుడు ఎప్పుడూ భయపడలేదు, ఎప్పుడూ భయపడబోడని… నిజం మాట్లాడే బతుకుతున్నాడు… నిజమే మాట్లాడతాడని చెప్పుకొచ్చారు. దేశ ప్రజల కోసం గొంతును పెంచుతూనే ఉంటారన్నారు. సత్యంలో దాగున్న శక్తి… కోట్లాది మంది దేశ ప్రజల ప్రేమ ఆయన వెంట ఉన్నాయని ప్రియాంక హిందీలో ట్వీట్ చేశారు.
ప్రతిపక్ష నేతలను అంతం చేసే పనిలో ఇది భాగమన్నారు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ‘‘ప్రతిపక్ష నేతలను, పార్టీలను అంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని, బీజేపీయేతర పార్టీల నేతలపై కేసులు పెట్టేందుకు కుట్ర జరుగుతోందని, రాహుల్‌గాంధీతో నాకు విభేదాలు ఉన్నాయని, అయితే ఆయనను పరువునష్టం కేసులో ఇలా చేయడం సరికాదన్నారు. కోర్టును గౌరవిస్తా కానీ తీర్పును విభేదిస్తానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
తీర్పుపై న్యాయపరంగా పోరాడతామన్నారు కాంగ్రెస్ చీఫ్ మలికార్జున్ ఖర్గే. ఐతే ప్రస్తుతం రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు అయ్యిందని… కేసు విచారణలో న్యాయమూర్తులను మారుస్తూనే ఉన్నందున ఇలా జరుగుతుందని మాకు మొదటి నుండే అనుమానం ఉందన్నారు. చట్టం, న్యాయవ్యవస్థను విశ్వసిస్తామన్న ఖర్గే… చట్టం ప్రకారం పోరాడతామన్నారు. ఐతే ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉండాల్సింది పూర్ణేష్ మోదీ కాదని… ప్రధాని మోదీయేనని గాంధీ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఎందుకంటే గాంధీ ప్రసంగానికి ప్రధాన లక్ష్యం ప్రధాని మోదీయేనని చెప్పారు. న్యాయవాది మాట్లాడుతూ, కోర్టు కార్యకలాపాలు మొదటి నుండి “లోపభూయిష్టంగా” ఉన్నాయని విమర్శించారు.