హైడ్రా నోటీసులపై మురళీమోహన్ ఏమన్నారంటే..
ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ కు చెందిన జయభేరి నిర్మాణ సంస్థలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగళాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మురళీ మోహన్ ఏమన్నారంటే.. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. ఆ షెడ్డును తామే తొలగిస్తామని చెప్పారు. అయితే.. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు వచ్చారని ఆయన పేర్కొన్నారు.

