ఐటీ దాడులపై దిల్ రాజు ఏమన్నారంటే..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ సోదాలు సినీ ఇండస్ట్రీలో దాదాపు అందరిపైనా జరుగుతున్నాయని, తానొక్కడిపైనే కాదని పేర్కొన్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన పలువురి ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజు నివాసాలు, కార్యాలయాలు, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాలలోనూ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయాలకు తగినట్లు పన్ను చెల్లింపులు జరగట్లేదని అధికారులు గుర్తించారు. దీనితో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

