‘ఏం చేద్దాం అనుకుంటున్నవ్ స్వామి తెలంగాణను’?.. KTR
తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ‘పనిమంతుడని పందిరేపిస్తే… పిల్లి తోక తగిలి కూలిందట’. గట్లనే ఉంది చీప్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తీరు అన్నారు. హైడ్రా హైరానాతో 2నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. ఆదాయం తగ్గిపోయింది. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి… భయాన్ని సృష్టించాడు. తీరా చూస్తే, రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది. అని మండిపడ్డారు.

