‘గుడ్ బుక్‌లో పేరుంటే ఏం చేస్తామంటే’…జగన్
వైసీపీ నేత జగన్ తాడేపల్లిలోని పార్టీ మీటింగులో రెడ్ బుక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్‌పై మండిపడ్డారు జగన్. రెడ్ బుక్ ఏదైనా పెద్ద పనా అంటూ ఎద్దేవా చేశారు. మేం కూడా రెడ్ బుక్ రాసుకుంటున్నాం. అలాగే గుడ్ బుక్ కూడా రాస్తున్నాం అన్నారు. పార్టీకోసం కష్టపడే వారి పేర్లను, ప్రజలకు మేలు చేసే వారి పేర్లను రాసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాంటి వారికి తప్పకుండా భవిష్యత్తులో ప్రమోషన్లు, మంచి అవకాశాలుంటాయన్నారు. నేను వద్దని చెప్పినా కూడా మా వాళ్లు రెడ్ బుక్ మెయిన్‌టెయిన్ చేస్తూ, అన్యాయం చేసే వారి పేర్లు, అధికారుల పేర్లు రాసుకుంటున్నారు. అని ఆయన పేర్కొన్నారు.