కరాచి బేకరీ దాడులపై మాకేం సంబంధం..
కరాచి బేకరీలపై జరుగుతున్న దాడులపై బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. ఇవాళ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు.. కరాచి బేకరి మీద బీజేపీ పార్టీ దాడి చేసిందని మంత్రి సీతక్క స్టేట్ మెంట్ ఇచ్చారని తెలిపారు. కరాచీ బేకరి పై మంత్రి సమాచారం తెలుపకుండా మాట్లాడారు. ఎవరో కొంత మంది కరాచి బేకరి పై దాడి చేస్తే దానికి బీజేపీకి సంబంధం లేదు. బీజేపీ ఇలాంటి దాడులు చేయదు. ఇండ్లపైన.. షాపుల పైన దాడి చేసే సంస్కృతి…సంస్కారం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మంత్రి సీతక్క తెలుసుకొని మాట్లాడాలి. ఇలాంటి దాడులను బీజేపీ ప్రోత్సహించదు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. అలా అని మా పార్టీ నేతల ఇండ్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. అని రాంచందర్ రావు ఫైర్ అయ్యారు.