Home Page SliderNational

జమిలి ఎలక్షన్‌పై ఇతరపార్టీలు  ఏమంటున్నాయి?

జమిలి ఎలక్షన్స్‌ను క్యాబినెట్ ఆమోదించగానే, కొన్ని పార్టీలు విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఏ పార్టీల తీరు ఎలా ఉందో తెలుసుకుందాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై రామ్‌నాథ్ కోవింద్ ప్యానెల్ 62 పార్టీల అభిప్రాయాలను సేకరించింది. వీటిలో 47 పార్టీలు తమ స్పందన తెలియజేశాయి. వీటిలో 32 అనుకూలంగా, 15 పార్టీలు వ్యతిరేకంగా స్పందించాయి. బీజేపీ, అన్నాడిఎంకే, అప్నాదళ్, ఎన్‌పీపీ, బిజూ జనతాదళ్, శివసేన, శిరోమణి అకాళీదళ్, అసోం గణ పరిషత్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. టీడీపీ, వైసీపీ, బీఆర్‌ఎస్ పార్టీలు స్పందించలేనట్లు తెలిసింది. కాంగ్రెస్, సమాజ్‌వాది, బీఎస్పీ, సీపీఎం, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు వ్యతిరేకించాయి.