వంగా సందీప్ రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య ఏమి డిస్కషన్…
అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపాడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు. ఇక రణ్‌బీర్‌కపూర్‌తో తెరకెక్కించిన యానిమల్ కనక వర్షం కురిపించింది. ఈ క్రేజీ డైరెక్టర్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తారక్ నటించిన దేవర ట్రైలర్‌ను సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్న విషయం కూడా తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా, తారక్ చర్చించుకుంటున్న స్టిల్ చూసిన మూవీ లవర్స్.. ఏంటీ ఈ ఇద్దరు సినిమాకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..? అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇద్దరిదీ కేవలం సరదా డిస్కషన్ మాత్రమేనని ఒక టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే అభిమానులు మాత్రం అర్జున రెడ్డి దర్శకుడు తారక్ కోసం సెన్సేషనల్ స్టోరీ రాయాలని భావిస్తుండగా.. మరి రానున్న రోజుల్లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఏమైనా వస్తుందేమో వెయిట్ చేయాలి.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర రెండు పార్టులుగా రాబోతుండగా.. పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌లో ఒక ట్రెండ్‌తో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.