Home Page SliderTelangana

పట్టభద్రులకు మీరేం చేశారు.. బండిపై సీతక్క ఫైర్..

కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. నిరుద్యోగులకు జవాబు చెప్పుకోలేక బండి సంజయ్ మత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంతకన్నా ఏమీ లేదని విమర్శించారు. అందుకే ఆయన నోరు తెరిస్తే హిందుస్తాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట లేదన్నారు. పట్టభద్రులకు మీరేం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని సీరియస్ అయ్యారు. బండి సంజయ్ పాకిస్తాన్ తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప వారు దేశానికి చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం విద్వేష ప్రసంగాల అవసరమా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు.