మద్యం మత్తులో అల్లుడు ఏం చేశాడంటే..
హైదరాబాద్ మీయాపూర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్య, అత్తపై కత్తితో అల్లుడు దాడికి పాల్పడ్డాడు. శ్రీదేవిని మహేశ్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే.. తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మద్యం సేవించి కత్తితో భార్య శ్రీదేవి, అత్తపై మహేశ్ దాడి చేశాడు. దాడిలో అత్త తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బంధువుల ఫిర్యాదు మేరకు మహేశ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కుటుంబ కలహాలే దాడికి కారణంగా ప్రాథమికంగా గుర్తించారు.