బస్సులో నిద్రిస్తున్న యువతిపై కండక్టర్ ఏం చేశాడంటే..?
బస్సులో నిద్రిస్తున్న యువతిపై ఓ కండక్టర్ లైంగికంగా వేధించాడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. కేఎస్ ఆర్టీసీ బస్సులో ఓ యువతిని కండక్టర్ లైంగికంగా వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఏప్రిల్ 22న జరిగింది. కండక్టర్ ప్రదీపన్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే.. సదరు యువతి బస్సులోని తన సీటులో కూర్చొని నిద్రపోతుండగా ఆమె పక్కనే వచ్చి నిలబడ్డ కండక్టర్, ఆమెను టచ్ చేసేందుకు పదే పదే ప్రయత్నించాడు.