Home Page SliderTelangana

‘హైడ్రా’ భయంతో మృతి చెందిన మహిళపై కమిషనర్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించి, కట్టిన ఇళ్ల విషయంలో నిర్ధ్యాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న ‘హైడ్రా’ భయంతో నగరంలోని ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్‌పల్లి యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ తన ముగ్గురు కుమార్తెలకు వివాహకానుకగా ఇచ్చిన ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుందనే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. శివయ్య, బుచ్చమ్మ దంపతులు వారి కూతుర్లకు రాసిచ్చిన ఇళ్లు కూకట్‌పల్లి చెరువుకు సమీపంగా ఉన్నమాట వాస్తవమే అయినా, ఎఫ్‌టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయి. కానీ తమ ఇళ్లను కూల్చేస్తారేమో అనే భయంతో కుమార్తెలు తల్లిని ప్రశ్నించారు. ఈ మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పైగా వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అంటూ పేర్కొన్నారు. మరోపక్క మూసీనది పరివాహక ప్రాంతంలో చేపట్టిన సర్వేతోనూ హైడ్రాకు సంబంధం లేదన్నారు. మీడియాలో శనివారం ఇళ్లను కూల్చివేస్తున్నట్లు భారీగా ప్రచారం జరిగిందని, దీనివల్ల సామాన్య ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నరు. హైడ్రా గురించి అనవసర భయాలు వద్దు. పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ ఖచ్చితమైన సూచనలు జారీ చేసింది. అంటూ కమిషనర్ పేర్కొన్నారు.