Home Page SliderTelangana

రెచ్చిపోతున్న మందుబాబులు.. నడిరోడ్డుపై ఏం చేశారంటే..?

హైదరాబాద్ లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. నడిరోడ్డుపై హంగామా చేస్తున్నారు. మద్యం మత్తులో గుర్తు తెలియని వ్యక్తులు మెర్సిడీస్ బెంజ్ కారు (TS07RR4455) నడుపుతూ స్కూటీని ఢీ కొట్టారు. తన కారును డ్యామేజ్ చేస్తావా అంటూ పచ్చి బూతులతో స్కూటీని నడిపే వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఈ ఘటన కొండపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని నడిరోడ్డుపై కొడుతుంటే పోలీసులు రాలేదని, లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అంటూ వాహనదారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దారిలో వెళుతున్న వారు తమ సెల్ ఫోన్ ద్వారా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో కాస్త వైరల్ గా మారింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు అర్ధరాత్రి పెట్రోలింగ్ సమయాన్ని పెంచాలని నెటిజన్లు కోరుతున్నారు.