ప్రాయశ్చిత్తంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే…
తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీ అయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా నేడు ఆయన విజయవాడ దుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. వేద పండితులు మంత్రోచ్ఛారణ చేస్తుండగా ఆయన ఆలయం మెట్లు కొన్నింటిని శుభ్రం చేశారు. వాటికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించారు.