Home Page SliderTelangana

మందుబాబు మత్తు మైకంలో ఏం చేశాడంటే..

మద్యం మత్తు మైకంలో పడి అనవసరంగా డయల్ 100కు ఫోన్ చేసిన ఓ వ్యక్తికి కోర్టు 4 రోజుల జైలుశిక్ష విధించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వేల్పూర్ మండలం పచ్చలనడకుడ గ్రామానికి చెందిన పులిసచిన్ మద్యం సేవించిన మైకంలో నిన్న రాత్రి 10.30 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటవరకు 7 సార్లు ఫోన్ చేసి తన వివరాలు చెప్పకుండా విసిగించాడు. దీంతో పోలీసులు అతడిని ఇవాళ అదుపులోకి తీసుకుని ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా కోర్టు సచిన్ కు 4 రోజుల జైలుశిక్షను విధించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడే డయల్ 100ను అనవసరంగా మద్యం సేవించి దుర్వినియోగం చేసినందుకుగాను న్యాయస్థానం శిక్ష విధించినట్లు ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.