Home Page SliderNational

తన ప్లాస్టిక్ సర్జరీపై కృతి శెట్టి ఏమన్నారంటే..!

హీరోయిన్ కృతిశెట్టి ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తన మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. అంతేకాకుండా ఆ సినిమాలో తన నటన,అందం,అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఉప్పెన సినిమా హిట్‌తో ఆమెకు వరుసగా ఆఫర్లు తలుపుతట్టాయి. దీంతో ఆమె టాలీవుడ్ టాప్ హీరోలతో జతకట్టి మెప్పించారు. కాగా ప్రస్తుతం కూడా ఆమె చేతినిండా ప్రాజెక్ట్‌లతో  బిజీగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కృతిశెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఈ వార్తలపై స్పందించారు. ఇలాంటి వార్తలు ఎవరు ఎందుకు రాస్తారో తెలియదన్నారు. ఈ వార్తలు విన్నప్పుడు తన మనసుకు చాలా బాధ కలుగుతుందని ఆమె తెలిపారు. కాగా ఉప్పెన సినిమాలో ఉన్నట్లు ఇప్పుడు లేనని దానికి కారణం ప్లాస్టిక్ సర్జరీనే అని రాశారన్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా అన్నారు. కొన్నిసార్లు మేకప్,హెయిర్‌స్టైల్ వల్ల కూడా ఫేస్‌లో మార్పు రావొచ్చని కృతిశెట్టి వెల్లడించారు.