ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన ఏం చేసిందంటే..
ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన కార్యకర్తలు విజయవాడలో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ మానవహారంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అమాయకులను ఉగ్రవాదులు చంపడం దుర్మార్గం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పవన్ చెప్పారు. ముందు దేశం, రాష్ట్రం..ఆ తర్వాతే మనం అంటూ పేర్కొన్నారు. కావలిలో జనసేన నేత మధుసూదనరావు భౌతికకాయాన్ని చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారని అన్నారు. బాధిత కుటుంబాలకు జనసేన పక్షాన కూడా సాయం చేసేలా ఆలోచన చేస్తున్నామని తెలిపారు.