రోడ్డు మధ్యలో కారు ఆపి.. ఓ యువకుడు ఏం చేశాడంటే..?
ఓ యువకుడు జంక్షన్ వద్ద రోడ్డు మీదే BMW కారు నిలిపి అక్కడే టాయిలెట్ పోశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. వేరే వ్యక్తి కెమెరాలో రికార్డ్ చేస్తుండగా.. ఆ యువకుడు ఇంకా అసభ్యంగా ప్రవర్తించాడు. ఏ భయం, బెరుకు లేకుండా మూత్ర విసర్జన చేశాడు. కారులో లోపల ఉన్న యువకుడి చేతిలో బీర్ బాటిల్ ఉంది. దాంతీ వీరు మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటన పూణేలోని ఎరవాడలోని శాస్త్రినగర్ ప్రాంతంలో జరిగింది. గౌరవ్ అహుజా అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేయడంతో మరోసారి ఇలా అసభ్యంగా ప్రవర్తించనని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆ యువకుడు క్షమాపణలు కోరాడు.