Home Page SliderTelangana

జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?

తెలంగాణ: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. పార్టీలోనే కొనసాగనున్నప్పటికీ ఎమ్మెల్సీ పదవి నుండి మాత్రం తప్పుకోవాలని ఆయన భావిస్తున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ పెద్దలతో చర్చల తర్వాత ఆయన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే ఛాన్సుంది. మరోవైపు ఆయన మద్దతుదారులు హైదరాబాద్ గాంధీభవన్ దగ్గర ఆందోళనకు దిగేందుకు రెడీ అవుతున్నారు.