Andhra PradeshHome Page Slider

ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ ఏమన్నారంటే..!

ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. కాగా నేడు జరిగిన వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ మాట్లుతూ..వచ్చే ఏడాది మార్చిలేదా ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. కాగా దీనిపై పార్టీ క్యాడర్‌కు క్లారిటీ ఇచ్చేందుకే సీఎం జగన్ ఈ ప్రకటన  చేసినట్లు తెలుస్తోంది.అయితే గతంలో 2019 అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.