ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి…
మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన సేవగుణంతో అందరి దృష్టిని ఆకర్షించారు. తన కుమారుడు సాయి ప్రసన్న వివాహ అనంతరం ఏర్పాటు చేయాలనుకున్న రిసెప్షన్ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని,వేడుక కోసం ఖర్చు చేయదలచిన రూ.2 కోట్లను రైతుల కోసం విరాళంగా ప్రకటించారు. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుండగా, లక్ష్మారెడ్డి ఈ విరాళాన్ని రైతుల కోసం వినియోగించాలని నిర్ణయించారు. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తాను ఉచితంగా అందించేలా ఈ నిధిని వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డికి చెక్‌ను అందజేశారు. ఎమ్మెల్యే రైతుల సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వకంగా అభినందించారు. నియోజకవర్గంలోని రైతులు కూడా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను ప్రశంసిస్తున్నారు.