సింగరేణిపై ప్రధాని మాటేమయ్యింది- కేటీఆర్
ఈ నెల 8 న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వేళ తెలంగాణా రాజకీయాలు వాడిగా,వేడిగా కొనసాగుతున్నాయి. సింగరేణిని ప్రవేటీకరించబోమని 2022లో నవంబర్ 12 న రామగుండంలో ప్రధాని ఇచ్చిన మాటేమయ్యిందని ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా యూటర్న్ తీసుకున్న కేంద్రప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలోనే సమాధానం చెప్తామన్నారు. తెలంగాణా మంత్రి కేటీఆర్. సింగరేణి బొగ్గు బావుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని సూచించారు. ఈనెల 8న మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రాల్లో మహా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

