Home Page SliderTelangana

ఏమాశ్చర్యం!! బీబీసీ ఐటీ సోదాలపై కేటీఆర్ ట్వీట్

బీబీసీ ఇండియా, ముంబై సంస్థలపై ఐటీ దాడులపై విపక్షాలు మండిపడుతున్నాయ్. తెలంగాణ ఐటీ మంత్రికేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కొన్ని వారాల క్రితం మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారమయ్యింది. ఇప్పుడు ఐటీ రెయిడ్స్ జరుగుతున్నాయంటూ తెలంగాణ మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. విచారణ సంస్థలు ఐటీ, సీబీఐ, ఈడీ నవ్వులపాలవుతున్నాయని… బీజేపీ కీలు బొమ్మలుగా మారడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తర్వాత ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. హిండెన్ బర్గ్‌పై ఈడీ దాడులు, లేదంటే శత్రువునే టేకోవర్ చేసుకుంటారా అంటూ ట్వీట్ చేశారు.