Home Page SliderTelangana

ఓ క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడంటే.. తెలిస్తే షాక్..

తన క్యాబ్ ఎక్కే ప్రయాణికులకు ఓ డ్రైవర్ పెట్టిన ఏడు రూల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డ్రైవింగ్ సీటు వెనుక వైపు చిన్నసైజు బోర్డు రూపంలో ఏడు రూల్స్ పట్టికను ఏర్పాటు చేశాడు. తనతో మర్యాదగా మసలుకోవడంతో పాటు యాటిట్యూడ్ చూపించకూడదని ఇలా ఏడు విషయాలను ప్రస్తావిస్తూ రూల్స్ బోర్డును ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ప్రయాణికుడు ఆ క్యాబ్ ఎక్కిన సందర్భంలో తన కంటబడ్డ ఆ రూల్స్ బోర్డును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అది కాస్తా వైరల్ గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఆ ఏడు రూల్స్ ఏంటంటే..

  1. మీరు ఈ క్యాబ్ కు యజమాని కాదు.
  2. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తే ఈ క్యాబ్ కి ఓనర్.
  3. మంచిగా మాట్లాడి మర్యాదకరంగా మసలుకోవాలి.
  4. డోర్ స్లోగా వేయాలి.
  5. ఎట్టిపరిస్థితుల్లో యాటిట్యూడ్ చూపించకూడదు. దాన్ని మీ జేబులో మడిచిపెట్టుకోండి. ఎందుకంటే మీరు మాకు ఎక్కువ డబ్బులేమీ ఇవ్వడం లేదు.
  6. నన్ను భయ్యా (బ్రదర్) అని మాత్రం పిలవకూడదు.
  7. స్పీడ్ గా డ్రైవ్ చేయమని కూడా అడగొద్దని రాసుకొచ్చాడు.