వామ్మో.. జీబీఎస్ వైరస్.. మహారాష్ట్రలో తొలి మరణం..
మహారాష్ట్రలో కొత్త వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత అరుదుగా భావిస్తున్న ‘గులియన్ బారే సిండ్రోమ్’తో అక్కడ తొలి మరణం నమోదైంది. పూణేకు చెందిన వ్యక్తి స్వగ్రామం సోలాపూర్ కు వెళ్లి అక్కడ అస్వస్థతకు గురి కాగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు జీబీఎస్ ఉన్నట్లు నిర్ధారించారు. అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి చనిపోయాడు. పూణేలో వెలుగు చూసిన ఈ వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 73 కేసులు నమోదు కాగా వీరిలో 14 మది వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి నరాల బలహీనత, తిమ్మిరి, పక్షపాతం వంటి వాటికి దారితీస్తుంది. అయితే.. వైరస్ బారిన పడిన వారు కోలుకునేందుకు చాలా సమయం పడుతోందని వైద్యులు చెబుతున్నారు.

