పర్యాటకులకు తిరిగి చైనాకు స్వాగతం
కఠిన జీరో కొవిడ్ పాలసీ అనంతరం చైనా తిరిగి విదేశీ పర్యాటకులకు తలుపులు తెరిచింది. చైనా గత మూడేళ్లుగా ఈ పాలసీని అవలంభిస్తోంది. దీనివల్ల దేశ ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింది. దీనివల్ల ప్రజలు కూడా ప్రభుత్వాన్ని చాలా వ్యతిరేకించారు. కొవిడ్ కూడా ఈ విధానం వల్ల నియంత్రణలోకి రాలేదు. భారీ స్థాయిలో కొవిడ్ కేసులు విజృంభించాయి. దీనితో ప్రభుత్వం దిగివచ్చి ఈ పాలసీని రద్దు చేసింది. ఇటీవలే కొవిడ్‌పై విజయం సాధించినట్లు ప్రకటించింది.

దీనితో మూడేళ్ల అనంతరం దేశ సరిహద్దులను తెరిచి పర్యాటకులను దేశంలోకి ఆహ్వానిస్తోంది. రేపటి నుండి అన్ని రకాల వీసాలను పునరుద్ధరిస్తోంది. పర్యాటకం నుండి గత మూడేళ్లుగా ఆదాయం లేకపోవడంతో తిరిగి ఈ రంగాన్ని గాడిలో పెట్టే చర్యలు చేపట్టింది. వీసాలు అవసరం లేని హాంకాంగ్, మకావు, హైనన్ ఐల్యాండ్ వంటి దేశాలనుండి కూడా టూరిస్టులను దేశంలోకి అనుమతిస్తున్నారు. 2020 మార్చి నెలకు ముందు విదేశీయులకు జారీ చేసిన వీసాలు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు.