కాన్ఫరెన్స్ కాల్ వల్ల బయటపడిన పెళ్లికొడుకు భాగోతం..
సెల్‌ఫోన్‌లో కాన్ఫరెన్స్ కాల్ కారణంగా ఆదిలాబాద్‌లో ఒక పెళ్లి రద్దయిన సంగతి జిల్లాలో వైరల్ అయ్యంది. జిల్లాకు చెందిన ఒక అబ్బాయికి పెళ్లి నిశ్చయం కాగా, కాన్ఫరెన్స్ కాల్ కారణంగా అతడి బండారం బయటపడింది. పెళ్లికుమార్తె అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అప్పటికే అతడు ప్రేమించిన యువతితో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఫోన్ రావడంతో ఆ కాల్‌ను హోల్డ్‌లో పెట్టి మళ్లీ కాల్ చేస్తానని చెప్పాడు. అయితే అనుకోకుండా ఆ ఫోన్ కాల్ కాన్ఫరెన్స్ కాల్‌గా మారింది. దీనితో పెళ్లికుమార్తెకు వారిద్దరి భాగోతం అర్థమయ్యింది. ఆ కాల్ రికార్డు చేసి, పెద్దల ముందు ఉంచింది. దీనితో కొన్ని రోజులలో జరగాల్సిన ఆ పెళ్లి రద్దయ్యింది.