నల్లబ్యాడ్జీలు ధరించి ఇండియా కూటమికి వ్యతిరేకంగా నినాదాలు
రాజోలి: పార్లమెంట్లో జరిగిన భాష్పవాయువు దాడిని నిరసిస్తూ అలంపూర్ మండలం బుక్కాపురం గ్రామంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ఇండియా కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంటులో దౌర్జన్యంగా వ్యక్తులు దూసుకొచ్చి బాష్పవాయువు ప్రయోగించి గందరగోళం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఈశ్వర్ తదితరులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

