Home Page SliderInternational

లో దుస్తుల విషయంలో ఎయిర్ లైన్స్ పై విమర్శలు

ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా పలు సూచనలు జారీ చేసింది. డ్రెస్సింగ్ ఎలా ఉండాలనే సూచనలతో పాటు లో దుస్తులు ఎలాంటివి ధరించాలనే విషయంపైనా ఈ కంపెనీ పలు సూచనలు చేయడం విమర్శలకు దారి తీసింది. మరీ వాటిపై కూడా కండీషన్లు పెడతారా? అంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థులు పద్ధతిగా డ్రెస్ వేసుకోవాలని డెల్టా కంపెనీ సూచించింది. అభ్యర్థి డ్రెస్సింగ్ ప్రొఫెషనల్ గా.. హుందాగా ఉండాలని పేర్కొంది. అంతే కాదు.. లో దుస్తులు విషయంలోనూ జాగ్రత్త వహించాలని, సరైన అండర్ గార్మెంట్స్ ధరించాలని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ లోదుస్తులు బయటకు కనిపించేలా ఉండొద్దని, మహిళా అభ్యర్థులు మరీ కురచ స్కర్టులు ధరించి రావొద్దని చెబుతూ ‘అప్పియరెన్స్ రిక్వైర్ మెంట్స్ అక్నాలెడ్జ్ మెంట్’ పేరుతో ఓ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. దీనిపై విమర్శలు వ్యక్తం కావడంతో.. తమ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ కు భంగం కలిగించకుండా ఉండేందుకే ఈ సూచనలు చేసినట్లు డెల్టా కంపెనీ ప్రకటించింది.