NDA ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కృషి చేస్తాం – తేజస్వీ యాదవ్
బిహార్ రాజకీయాల్లో కొత్త వేడి రేపుతూ ఆర్జేడీ నేత, మహాఘట్‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్డీయే పాలనను కూలద్రోసేందుకు అన్ని విపక్ష పార్టీలు కలసి పనిచేస్తాయని ఆయన ప్రకటించారు.
“డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కానీ, ఒక ఇంజిన్ అవినీతి, మరొకటి నేరాలకు ప్రతీకగా మారింది,” అని తేజస్వీ ఎద్దేవా చేశారు. బిహార్‌లో నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, “200 రౌండ్ల కాల్పులు జరగని రోజు కూడా లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త బిహార్ నిర్మాణం తమ లక్ష్యమని తేజస్వీ స్పష్టం చేశారు. అలాగే, NDA తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో స్పష్టంగా ప్రకటించాల్సిందిగా BJP, అమిత్ షా లకు ఆయన డిమాండ్ చేశారు.

