బీఆర్ఎస్ కు మద్దతుపై ఆలోచిస్తాం: సజ్జల రామకృష్ణారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన భారత రాష్ట్ర సమితి పై మా ఆలోచన మాకుందని బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని వారు అడిగితే ఏం చేయాలనే విషయంపై అప్పుడు ఆలోచిస్తామని దీనిపై అందరితో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఏపీ ప్రయోజనాలే ప్రాతిపదికగా తమ పార్టీ పనిచేస్తుందని, రాష్ట్ర ప్రజల అవసరాలను వైసీపీ మాత్రమే తీర్చగలదని ఆయన అన్నారు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వచ్చే ఆలోచన తమ పార్టీకి లేదని ఖరాకండిగా చెప్పారు. రాజకీయ పార్టీగా రాష్ట్రంలో ఏ పార్టీ అయినా పోటీ చేయవచ్చని ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని అన్నారు. తమ అధినేతకు ఏపీ అభివృద్ధి సంక్షేమం, తప్పవేరే ఆలోచనలు లేవని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పోటీ చేసే ఆలోచనలు పార్టీకి లేవని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే ఆలోచన ఉంటే తెలంగాణలోనే పోటీ చేసే వాళ్ళం కదా అని ప్రశ్నించారు. విభజన హామీలను తీర్చడంలో వైసీపీ పోరాటం చేస్తూనే ఉందని, పోరాటం అంటే యుద్ధం చేయటం కాదని ఎప్పుడు ఎక్కడ ఎలా ఒత్తిడి తేవాలో తమకు తెలుసని అన్నారు.