మహిళా వ్యాపారులకు సహకారమందిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ: రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని, వారికి వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మహిళలకు ప్రభుత్వ సహకారం ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం రూపొందించే పారిశ్రామిక విధానంలో మహిళలకు తగిన ప్రాధాన్యమిస్తామన్నారు.

