ఆడబిడ్డకు అన్ని విధాలా అండగా ఉంటాం
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో “స్వస్త్ నారీ – స్వశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 21 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి తరువాత రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలాయపాలెం–ములకలపల్లి బిడ్జి వరకు అప్రోచ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఇతర శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ … “ఆడబిడ్డకు అన్ని విధాల అండగా నిలుస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. మహిళల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యతనిస్తూ పలు పథకాలు కొనసాగిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో విద్యా, వైద్య రంగాలకు ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం అందుబాటులో ఉండేలా డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలni సూచించారు.
కేంద్రం మహిళల ఆరోగ్యానికి 15 రోజులపాటు మాత్రమే కార్యక్రమాలు చేపడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిరంతరం మహిళల ప్రయోజనాల కోసం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.