Andhra PradeshHome Page Slider

అందరికీ వాలంటీర్ల ద్వారా రూ.2,500 అందిస్తాం: సీఎం జగన్

తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించి రైతులతో మాట్లాడారు. వాకాడు మండలంలోని స్వర్ణముఖి నది కట్టతెగి నష్టపోయిన ప్రాంతాలను సీఎం జగన్ పరిశీలించారు. ఈ క్రమంలో నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. కాగా, సీఎం జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసింది. మనకు వచ్చిన కష్టం.. నష్టం వర్ణనాతీతం. వరుసగా వర్షాలు పడటంతో రైతులు నష్టపోయారు. 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి రూ.2,500 ఇచ్చాము. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తాం. రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతాం. తుపాను బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటాం అని అన్నారు.